చెట్టులో వెలసిన విఘ్నేశ్వరుడు.. పూజలతో భక్తులకు పూనకాలు! ఎక్కడంటే..

సర్వ విఘ్నాల నుంచి కాపాడే దేవుడు విఘ్నాదిపతి వినాయకుడు. ఎక్కడైనా ఎప్పుడైనా తొలి పూజ ఆయనికే చేయడం సాంప్రదాయం. అయితే ఇటీవల కాలంలో వినాయకుడికి ప్రత్యేకత సంతరించుకుంది. వినాయక చవితి వచ్చిందంటే చాలు అనేక రూపాల్లో వున్న బోజ్జ గణపయ్యని మలచి పూజలు నిర్వహిస్తున్నారు. కొందరైతే ఏకంగా ఫేమస్ హీరోలు వేసిన గెటప్‌ల ఆధారంగా తయారుచేసిన బాహుబలి వినాయకుడు, అదేవిధంగా పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ గెటప్ లో తయారు చేస్తున్నారు. ఈ వినాయక విగ్రహాలు ఎంతో ఫేమస్ అయ్యాయి. అలా మలచిన విగ్రహాలకు ఎంతో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఉత్సవాల చివరి రోజున నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.