ఆటలాడితే, ఆరోగ్యంగా ఉంటామని అందరం అనుకుంటున్నాం. కానీ రెగ్యులర్‌గా షటిల్ ఆడుతున్నా.. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన 25 ఏళ్ల రాకేష్, మృత్యువు నుంచి తనను తాను కాపాడుకోలేకపోయాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నాగోల్‌లో ఈ జరగరాని ఘోరం జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఎలక్ట్రానిక్ కార్ షోరూమ్‌లో రాకేష్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడికి రోజూ షటిల్ ఆడే అలవాటు ఉంది. అలవాటు ప్రకారం, నిన్న రాత్రి స్నేహితులతో కలిసి షటిల్ ఆడుతుండగా, గుండె పోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలాడు..