నీటి గుంతలో కూర్చొని యువకుడి వింత నిరసన

బైక్‌పై వెళ్తే నిబంధనల పేరుతో ఫైన్ వేస్తున్నారు. అన్ని రకాల టాక్సులు వసూలు చేస్తున్నారు. కానీ.. రోడ్డు మరమ్మతులు చేయడం లేదంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా నడిరోడ్డుపై గుంతలో కూర్చొని నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.