ఇకపై మరింత రుచిగా తిరుమల లడ్డూ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కర్ణాటక ప్రభుత్వ ‘నందిని’ బ్రాండ్ నెయ్యి సరఫరా మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల 350 టన్నుల నెయ్యి సరఫరా చేయాలని తితిదే కోరడంతో సరఫరాను మళ్లీ ప్రారంభించామని కర్ణాటక పాల సమాఖ్య అధికారులు తెలిపారు.