జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఈ లవ్ మ్యారేజ్ అంగరంగ వైభవంగా జరిగింది. గొల్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు, మల్యాల మండలం మ్యడంపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్‌తో రెండేళ్ల క్రితం ప్రేమలో పడ్డాడు. వీరి మధ్య చిగురించిన ప్రేమ, యువకుడు ఉపాధి కోసం దేశం వీడినా మరింత పెరిగింది. పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకుంది ఈ జంట. యువకుడి ఇంట్లో ఒప్పించి మరికొందరి బంధువులు, ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు.