రోడ్డుమీదే రౌడీలకు... ట్రీట్మెంట్

నెల్లూరు నగరంలో ఇటీవల రౌడీలు రెచ్చిపోతున్నారు.. పట్ట పగలే దాడులు, హత్యలు చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు.. ఇటీవల కాలంలో వరుస ఘటనలతో నెల్లూరు నగరం ఉలిక్కి పడింది.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రౌడీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వెరైటీ పనిష్మెంట్ ఇస్తున్నారు.. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి..