బాత్ రూమే.... నివాస గృహం పేదరికమే శాపం అయింది, ఒంటరితనం భారమైంది.దీనితో బ్రతుకు బాత్రూం పాలయ్యింది. నిరక్షరాస్యత ఓవైపు,తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో తెలియని అమాయకత్వం మరోవైపు.ఎప్పుడో 20 ఏళ్ల కిందట నిర్మించిన చిన్నఇల్లు,ఇప్పుడు కురుస్తున్న చిన్న చిన్న వర్షాలకే పైనుండి వర్షపునీరు కురుస్తుండటంతో ఆ ఇంట్లో నివసించలేక ఓ గిరిజన వృద్ధుడు బాత్రూం గదినే నివాసగృహంగా మార్చుకొని గృహలక్ష్మి పథకం కోసం ఎదురుచూస్తున్నాడు.