పేదల కోసం ఉన్న పార్టీ బీఆర్ఎస్: సీఎం కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ దూకుడు కొనసాగుతోంది. ప్రతిరోజూ మూడు నాలుగు సభలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు గులాబీ బాస్‌. ఏం చెప్పాలనుకున్నారో.. సూటిగా సింపుల్‌గా చెబుతూ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. అయితే... కరీంనగర్‌, చొప్పదండి, హుజురాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో అనేక కొత్త అంశాలను టచ్‌ చేశారు.