తుఫాన్ తో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ఈ క్రమంలో.. చీకటి పడుతుండగా.. ఓ మహిళకు పురిటినొప్పులు మొదలవ్వడంతో.. కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.. వాగు పొంగి ప్రవహిస్తుండటంతో.. బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించింది.. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడం కష్టంగా మారింది.. ఈ క్రమంలోనే 108 పైలట్ చాకచక్యంతో గర్భిణి క్షేమంగా ఆసుపత్రికి చేరుకుంది. ఈ ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది.