ఓర్నాయనో.. పామురోయ్‌! నీళ్లలో ఈత కొడుతుండగా షర్టులో దూరిన భారీ విషసర్పం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, చెరువులు నిండు కుండలా పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. దీంతో కొందరు పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించేందుకు జలాశయాల వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కూడా సరదాగా ఈత కొట్టేందుకు ఓ డ్యామ్‌ వద్దకు వెళ్లాడు. పాల పుంతలా పొంగి పొర్లుతున్న నీళ్లతో స్నానం చేయాలని ఉవ్విళ్లూరాడు. అంతే పోయి ఒక్క గెంతులో నీళ్లలోకి దూకేశాడు.