ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, చెరువులు నిండు కుండలా పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. దీంతో కొందరు పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించేందుకు జలాశయాల వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కూడా సరదాగా ఈత కొట్టేందుకు ఓ డ్యామ్ వద్దకు వెళ్లాడు. పాల పుంతలా పొంగి పొర్లుతున్న నీళ్లతో స్నానం చేయాలని ఉవ్విళ్లూరాడు. అంతే పోయి ఒక్క గెంతులో నీళ్లలోకి దూకేశాడు.