హైదరాబాద్ పోలీసులను పొగిడిన ఎమ్మెల్యే రాజా సింగ్ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత టి. రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనను ఫోన్‌లో బెదిరిస్తున్నారని, హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నారని రాజా సింగ్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పారు. దీనిపై రాజాసింగ్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.