విద్యార్థులకు అలర్ట్.. 5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే..

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. 5 - 8 తరగతులకు 'నో డిటెన్షన్ పాలసీ'ని రద్దు చేసింది.. ఇది పాఠశాలల్లో అకడమిక్ అకౌంటబిలిటీని పెంపొందించే దిశగా మార్పును సూచిస్తుందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. ఒకవేళ విద్యార్థులు ఈ తరగతుల్లోని వార్షిక పరీక్షల్లో పాస్ కాకపోతే.. మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నారు.