దర్గా బాబా సలహా ప్రకారం తాయత్తు కట్టుకునేందుకు నదిలో మునగగా.. జరిగిందిదే..

మూఢనమ్మకం అక్కా, తమ్ముడు ప్రాణాలను బలితీసుకుంది. ఆరోగ్యం బాగాలేదని దర్గా బాబా దగ్గరికి వెళితే నదిలో మునిగి తాయెత్తులు కట్టుకోమని సలహా ఇచ్చాడు. బాబా చెప్పిన సలహా మేరకు వెళ్లే దారిలో నదిలో మునిగిన అక్కా, తమ్ముడు అనంతలోకాలకు వెళ్లిపోయారు. నంద్యాల జిల్లా, చాగలమర్రి టౌన్‎కు చెందిన షేక్ ఖాజా హుస్సేన్, అతని భార్య షేక్ ఇమామ్ బీ, బావమరిది అయిన ఫకీర్ మస్తాన్‎లు ముగ్గురు కలిసి షేక్ ఇమాంబి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కడప జిల్లాలోని ఎర్రగుంట్ల దర్గా వద్ద పూజలు చేయించుకుని తాయిత్తులు తీసుకున్నారు.