మనిషికి ప్రకృతికి అవినాభావ సంభందం వుంది. చుట్టూ సంచరించే పలు రకాల జంతువులను మచ్చిక చేసుకుని వాటి పై ఆధారపడి మనిషి జీవిస్తుంటాడు. అయితే కోడి, మేక, ఆవులు, పశువులు, కుక్క ఇవన్నీ తమ యజమానికి నమ్మకంగా ఉంటాయి. వారి మాట వినటంతో పాటు పెంపకందారు నివాస ప్రాంతంలో ఉంటా జీవిస్తుంటాయి. ఐతే ఆ ఊర్లో ఉన్న కొండముచ్చు మాత్రం ఊరందరికీ స్నేహితుడిగా మారిపోయింది. ఎవరు ఏది పెట్టినా తినటం అందరితో కలిసిపోవడం తో ఎవరు దాన్ని ఏమి అనటంలేదు.