ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విషయం తెలియక.. వృద్ధులు.. ఇతర పెన్షన్ దారులు గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర భారీగా బారులు తీరారు. ఎండాకాలం కావడంతో.. ఉదయమే వచ్చి సచివాలయాల దగ్గర వెయిట్ చేస్తున్నారు.