చావు కళ్ల ముందే స్పష్టంగా కనిపించింది..!

వాన రాకడ.. ప్రాణం పోకడ.. ఎవరూ చెప్పలేరన్నట్లు, రెప్పపాటులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గుడిలో ప్రదక్షిణాలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌ మహానగరం పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కూకట్‌పల్లి హౌజింగ్‌ బోర్డు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కేబీహెచ్‌బీ రోడ్ నెంబర్ 1 లో అమ్మ హాస్టల్లో విష్ణువర్ధన్ అనే యువకుడు ఉంటున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న విష్ణువర్ధన్‌ ప్రతిరోజు ఉదయం వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళుతుంటాడు. ఈ క్రమంలోనే ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి