ఉప్పల్‌లో పట్టుబడ్డ డిఫెన్స్‌ లిక్కర్.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌.. విచారణలో అసలు విషయం..!

హైదరాబాద్, ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధి చిలక నగర్ ప్రధాన రహదారిలో డిఫెన్స్ లిక్కర్ 21 బాటిల్స్ ను కలిగి ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు మాజీ సైనికుడు , మరొకరు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పోలీసులు వెల్లడించారు. వీరి వద్ద వివిధ కంపెనీలకు చెందిన 21 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన వారు A1 బి సత్యనారాయణ 65, మాజీ సైనికుడు. కాగా, మరో వ్యక్తి A2 పడాల రాజకుమార్ 33. ఇతను ఆపిల్ ఇండియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి గా పనిచేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.