ఆర్థిక రాజధాని ముంబై మీరా రోడ్‌కు చెందిన యువకుల వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వారు సిగరెట్లు తాగుతూ, పొగ ఊదుతూ ఉన్న రీల్స్ మీరా రోడ్ పోలీస్ స్టేషన్ లోపల చిత్రీకరించారు. ఈ రీల్ వేగంగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.