పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు టీచర్లు కూడా సిలబస్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం పూట విద్యార్ధులందరూ క్లాస్‌లో కూర్చుని టీచర్ పాఠాలు వింటుండగా.. ఓ బాలిక ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శనివారం (డిసెంబర్ 13) ఈ దారుణం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.