తెలంగాణ ప్రజలకు ధరణి సమస్యల నుంచి మోక్షం కలిగేనా..? ధరణి పేరు మార్పు పై సీఎం రివ్యూలో డెసిషన్ తీసుకుంటారా? ధరణి, రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అడుగులు ఎలా ఉండబోతున్నాయో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష చేయనున్నారు. ఫుల్ డే ధరణిపై మంత్రులు, ధరణి కమిటీ, ఉన్నతాధికారులతో కలిసి అధ్యయనం చేస్తారు.