వికారాబాద్ జిల్లా బహీరాబాద్‌లోని నవాంద్గీ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు చివరలో కింద నుంచి ఆటువైపుగా దాటి వెళ్లేందుకు ఓ గుర్తు తెలియని మహిళ ప్రయత్నం చేసింది. అయితే ఇంతలో ఆ రైలు అకస్మాత్తుగా కదిలింది. తొలుత కొంత కంగారు పడినా.. ఆ తర్వాత ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సదరు మహిళ రైలు కింద పట్టాల మధ్యన తల వంచి అలాగే పడుకుని పోయింది. ఆమెను గమనించిన అక్కడే ఉన్న స్థానిక యువకుడు రైలుకిందకు వెళ్లిన మహిళతో మధ్యలో కింద పడుకోమని చెప్పి, ఈ మొత్తం దృశ్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.