మేడారం సమ్మక్క – సారలమ్మ తీర్చుకున్న సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించారు. సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సీఎంకు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. గద్దెల ప్రాంగణంలో మాస్టర్ ప్లాన్‌ను రేవంత్ పరిశీలించారు. మేడారం జాతర ఏర్పాట్లు, అభిృద్ధిపై సీఎం సమీక్షించనున్నారు.