రోడ్డుపైనే హద్దులు దాటి ముద్దులు..!

హైదరాబాద్ నగరం పాతబస్తీ పహాడీషరీఫ్ ప్రధాన రహదారిలో ఓ జంట బైక్‌పై వెళ్తూ కెమెరాకు చిక్కింది. చుట్టూ ఎవరూ లేరు అనుకున్నారో.. లేక వాళ్లే ఏదైనా వేరే లోకంలో విహరిస్తున్నారో తెలియదు గానీ నడిరోడ్డు మీద ఉన్నామనే ధ్యాసే లేకుండా ప్రవర్తించారు. బైక్ నడుపుతున్న అబ్బాయి ఒడిలోనే కూర్చుంది అమ్మాయి ఏకంగా. అలా పట్టపగలు రోడ్డుపైనే హద్దులు దాటి ముద్దులు పెట్టుకుంటూ విహరించారు. ఇది చూసి అక్కడ ఉన్నవారు సిగ్గుతో తల దించుకోక తప్పలేదు.