జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయ ప్రాంగణం కార్తీక పౌర్ణమి సందర్భంగా కిటకిటలాడింది. శివనామ స్మరణతో మారు మోగింది. శ్రీశైలం కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం కార్యక్రమంలో మంత్రి రోజా, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు.