హైదరాబాద్‌లోని ఆక్రమణల తొలగింపు కోసం ఏర్పాటైన హైడ్రా 100 రోజులు పూర్తి చేసుకుంది. 310 అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో 144 ఎకరాల భూములను పరిరక్షించినప్పటికీ.. విమర్శలు, ఆరోపణలలు, వివాదాలు, న్యాయపోరాటాలు ఎదుర్కొంది. రాజకీయ ప్రభావం ఉన్న వారిపైనా చర్యలు తీసుకోవడంతో హైడ్రా చర్యలపై విమర్శలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.