ఎన్నికల వేళ తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీకి షాక్ తగిలింది. బొజ్జల సుధీర్‌రెడ్డి మానసికంగా వేధిస్తున్నారంటూ తిరుపతి తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఏపీలో ఎన్నికల రాజకీయం హీట్ పుట్టిస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. వివిధ పార్టీల్లో ఉన్న నేతలను కూడా దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.