కాకినాడ జిల్లా బిక్కవోలు గ్రామానికి చెందిని జంప మంగాయమ్మ( 54), మే 25, ఆదివారం రోజున చేపల కూరతో భోజనం చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఒక్కసారిగా ఛాతీ, ఉదర భాగంలో నొప్పి ప్రారంభమైంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కాకినాడలోని వివిధ ఆసపత్రులను సంప్రదించినా మూడు రోజులపాటు ఎలాంటి రిలీఫ్ దక్కలేదు.