కరువు సీమలో పర్యాటకం పరుగులు తీసింది. డోన్ చుట్టుపక్కలి ప్రాంతాలను చూసేవారి సంఖ్య భారీగా పెరిగింది. వీకెండ్స్‌లో పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. ఏపీలో ఒక్క ఎకరానికి కూడా నీటిపారుదలలేని నియోజకవర్గం డోన్. అలాంటి ప్రాంతంలో పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పూర్తి డ్రై అయిన వెంగలాంపల్లి చెరువు, అప్పిరెడ్డిపల్లి చెరువులకు శాశ్వత ప్రాతిపదికల పైప్ లైన్ నిర్మించి హంద్రీనీవా నీటితో నింపేశారు. రెండు చెరువులను ఆరు కోట్ల రూపాయలతో పర్యాటకంగా తీర్చిదిద్దారు.