భారీ వర్షాలతో పొంగుతున్న పాలేరు వాగు.. వంతెనపై చిక్కుకున్న బస్సు

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లో బుధవారం రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. బనగానపల్లె తో పాటు కోవెలకుంట్ల సంజామల అవుకు కొలిమిగుండ్ల మండళాల్లో వర్షం కురిసింది. కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో అధిక వర్షపాతం నమోదయింది. సంజామల వద్ద ఉప్పొంగిన పాలేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. పాలేరు వాగు వంతెన పై వర్షపు నీరు ప్రవహిస్తోంది. నాలుగు అడుగుల మేర వంతెన పై వరద నీరు ప్రవహిస్తుండడంతో తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున వరద నీటిలో చిక్కుకుంది