పోలీస్ స్టేషన్‌లో దొంగలు పడ్డారు..! నల్లమాడ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి కంప్యూటర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం కార్యాలయం తలుపులు తెరిచి చూసిన సిబ్బంది షాక్ అయ్యారు. కంప్యూటర్ తోపాటు ప్రింటర్ కనిపించకపోవడంతో సిబ్బందికి ఏం జరిగిందో అర్థం కాలేదు. చాలాసేపటి తర్వాత కంప్యూటర్ చోరీకి గురైనట్లు పోలీస్ సిబ్బంది నిర్ధారించుకున్నారు. సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయానికి రాత్రి తాళాలు వేయకుండా తలుపులు దగ్గరకు వేసి సిబ్బంది వెళ్ళిపోయారు. తాళాలు వేయకపోవడంతో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. అయితే రాత్రి డ్యూటీలో ఇద్దరూ సెంట్రీలు కాపలా ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్‌లో దొంగతనం జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.