మణిపూర్‌లో భారీ వరదలు.. 10వేల ఇళ్లకు నష్టం

మణిపూర్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. 10,000కు పైగా ఇళ్లకు నష్టం కలిగించింది. ఆకస్మిక వరదల కారణంగా సుమారు 56,000 మంది ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడగా, అధికారులు 2,913 మందిని కాపాడి సురక్షితంగా రక్షించారు. వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి సహాయం అందించడానికి 57 రహదారి క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం, రెస్క్యూ టీములు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.