గుడి కడితే బిచ్చగాళ్లు పెరిగిపోతారు..: ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీశాయి.. గుడి కడితే బిచ్చగాళ్లు పెరిగిపోతారు.. బడి కడితే మేధావులు పెరుగుతారని ఆయన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల ఇప్పుడు హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.