బాపట్ల రైల్వే స్టేషన్‌లో మతి స్థిమితం లేని బాలుడు హల్‌చల్ చేశాడు. గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ బాపట్ల రైల్వే స్టేషన్‌కు రాగానే.. అప్పటికే ఫ్లాట్‌ఫాంపై ఉన్న బాలుడు ఒక్కసారిగా ఇంజిన్ బోగిపైకి ఎక్కాడు. ఎవరూ ఊహించని ఈ ఘటనతో నివ్వెరపోయిన రైల్వే యంత్రాంగం వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు.