మణికొండలో అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌ 9వ అంతస్తులో మంటలు

మణికొండ, రామంతపూర్‌లోని ఈఐపీఎల్‌ అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మూడురోజుల క్రితం గృహప్రవేశం జరిగింది. సంతోష్‌ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా కలశం వెలిగించి.. అంతా నిద్రపోయారు. అక్కడ వెలిగించిన దీపం బుధవారం తెల్లవారు జామున కిందపడింది. దీంతో మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన సంతోష్‌ కుటుంబం ఇంట్లో గ్యాస్‌ స్టౌవ్‌ను ఆఫ్‌ చేసి, వెంటనే కిందకు పరుగులు తీశారు.