వానరానికి కరెంట్ షాక్.. వెంటనే CPR చేసిన స్థానికులు.. కాసేపటికి...

నారాయణపేట జిల్లా మక్తల్‌లో హృదయాన్ని హత్తుకునే ఘటన వెలుగుచూసింది. కరెంట్ షాక్‌తో చెట్టు మీద నుంచి కిందపడి స్పృహ కోల్పోయిన వానరానికి అక్కడి మున్సిపల్ సిబ్బంది, స్థానికులు సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. కాసేపటికే లేచిన వానరం మళ్లీ గంతులేస్తూ వెళ్లిపోవడం అందరికీ ఆనందాన్నిచ్చింది.