హైదరాబాద్ మహానగరం అని చెప్పుకోవడానికే గొప్పగా ఉంటుంది కానీ ఇక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు స్థానికులు. ఒక్కసారి ఈ వీడియోలు చూస్తే.. అది రోడ్డా.. లేక చెరువా అనేలా మారిపోయింది. ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రోడ్లు, గల్లీలు ఇలా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. బోరబండ రోడ్లపై డ్రైనేజ్ వాటర్ ఉప్పొంగుతోంది. వర్షాకాలం వస్తే ప్రతి ఏడాది పరిస్థితి అంటున్నారు అక్కడి వాసులు.