కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ విఫల రాజకీయ నేత

కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ విఫల రాజకీయ నేత తమ పార్టీ ఏ ఒక్క మతానికి పరిమితం కాదన్నారు ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ. హిందూవులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మేము అనలేదన్నారు. టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్.. కాంగ్రెస్, బీజేపీల తీరుపై విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీని చిత్తుగా ఓడిస్తామన్నారు. రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి, టీకాంగ్రెస్‌ రిమోట్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో ఉందన్నారు.