స్వయంభు శ్రీసిద్దేశ్వరాలయంలో అద్భుతం..! ఆ వింత మహత్యమా..! లేక ఆలయ నిర్మాణంలో నైపణ్యమో..? ఏమో కానీ.. సూర్యకిరణాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఓ వింత ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఏడాదిలో కేవలం మూడు రోజులు మాత్రమే గర్భగుడిలోని శివలింగంపై పడే కిరణాలు, పరమ శివుడి మహాత్యంగా బావిస్తున్నారు. గర్భగుడిలో సర్వదర్శనం మరో విశిష్టత.. అసలు ఆ సూర్య కిరణాలు కేవలం వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో మాత్రమే ఎలా శివలింగంపై పడుతున్నాయి..? చుట్టూ గుట్టలు, నాలుగు ప్రధాన ద్వారాలను దాటి లింగంపై సూర్యకిరణాలు పడడం ఎలా సాధ్యం..?