ఇది ప్యూర్ రివేంజే. వెంజెన్స్ ఎలా ఉంటుందో.. గ్రడ్జ్‌తో ఎలా కొట్టాలో.. ఈరోజు భారత ఆటలో కనపడబోతోంది. ఈ వరల్డ్‌కప్‌లో మన ఆటతీరు అంతా చూస్తూనే ఉన్నారు. ప్రతీ మ్యాచ్‌లో మినిమం 9మంది ఆటగాళ్లు పెర్ఫామ్ చేస్తున్నారు. ఒకరు కాకపోతే ఇంకొకరు అనే పరిస్థితి నుంచి.. ఒకరి తర్వాత ఒకరు.. ఒకర్ని మించి ఇంకొకరు ఆడుతున్నారు. ఓపెనర్ల సమస్యలేదు, టాప్ ఆర్డర్ టాప్ లేపుతోంది.