ఖమ్మం జిల్లా బోదులబండకు చెందిన కాకాని సీతారాంచౌదరి ఇటీవల మింత్రా ఆన్‌లైన్ యాప్‌లో మోచీ మెన్ లెదర్ కంఫర్ట్ శాండిల్స్ బుక్ చేశారు. ఆర్డర్ సమయంలోనే రూ.3,990ను యాప్‌లో ముందస్తు చెల్లింపు చేశారు. సోమవారం వచ్చిన పార్సిల్ తెరిచి చూడగా అందులో మురికి చెప్పు ఒకటి దర్శనమివ్వడంతో కంగుతిన్నారు. ఖరీదైన మోచీ బ్రాండ్ చెప్పులను బుక్ చేస్తే వినియోగించిన చెప్పుల జత డెలివరీ కావటంతో అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు.