"ఓ చిన్ని పిచ్చుక.. చిన్నారి పిచ్చుక" పాటను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి స్వయంగా ఆలపించారు.. ఈ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్వయంగా ఆలపించిన "ఓ చిన్ని పిచ్చుక.. చిన్నారి పిచ్చుక" పాట వీడియో పాటను ఆవిష్కరించారు. హిందీలో స్వానంద్ కిర్కిరే అనే రచయిత రాసి పాడిన ఈ పాటను రచయిత, తెలుగు ఉపాధ్యాయులు నంది శ్రీనివాస్ తెలుగులోకి అనువదించగా కలెక్టర్ పాడారు.