జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం.. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోతో పాటు బైక్ను డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక బాలిక ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన డిసిఎం వాహనం దగ్ధం అయింది.