తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గత ఎన్నికల్లో విజయం కైవసం చేసుకుని అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్.. ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్ర మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది. నిత్యం వేలాది మంది మహిళలు ఆధార్ కార్డు చూపించి, బస్సుల్లో ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం అడపాదడపా బస్సుల్లో కోట్లాటలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల కోసం మహిళలు ఘర్షన పడటం, డ్రైవర్, కండక్టర్‌లపై దాడులు చేయడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల మధ్య కొట్లాటలు ఆగడం లేదు. తాజాగా మహబూబ్‌నగర్‌లో ఇలాంటి ఘర్షణ మరోమారు చోటుచేసుకుంది