"పోకిరి" సినిమా చూపిస్తూ మెదడుకు శస్త్ర చికిత్స.. సర్కారు దవాఖాన వైద్యుల అద్భుతం

గుంటూరు జనరల్ ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ జరిగింది. పెషెంట్‌కు ఇష్టమైన సినిమా చూపిస్తూ.. బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ప్రైవేటు ఆసుపత్రులకు పరమితమైన అత్యాధునికి చికిత్సలు ప్రభుత్వాసుపత్రిల్లో విజయవంతంగా పూర్తి చేస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ వైద్యరంగంలో తొలిసారిగా రోగి మెలకువలో ఉండగానే మెదడు ఆపరేషన్‌ చేశారు గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు.