మాజీ సీఎం కేసీఆర్ కు భద్రత కుదింపు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు భద్రత కుదిస్తున్నట్టు రాష్ట్ర పోలీసుశాఖ తెలిపింది. కేటీఆర్, హరీశ్‌రావు సహా గెలిచిన మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు కేటాయించే భద్రతనే ఇచ్చినట్టు తెలిసింది. మాజీ సీఎం, క్యాబినెట్ ర్యాంకు కలిగిన ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు ప్రస్తుతం ‘వై’ క్యాటగిరీ భద్రతను కేటాయించినట్టు సమాచారం. థ్రెట్ పర్సప్షన్ రేట్(టీపీఆర్)కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.