కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లిలో ఉదయం అంతా ఉత్సాహంగా సందడిగా ఉన్న వధువు... రాత్రి శోభనం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీలో నవవధువు ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షితకు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన వరుడు నాగేంద్రతో ఆగస్టు నాలుగో తేదీన సోమవారం ఉదయం వివాహం జరిగింది.