చీపురు, తాపి చేతపట్టిన పెద్దాసుపత్రి సూపరింటిండెంట్..

రోజు వేలాది మంది అక్కడికి వస్తుంటారు. దాదాపు వందల సంఖ్యలో అక్కడ బెడ్స్ ఉంటాయి. కాని పారిశుద్యం మాత్రం ఉండదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటాయి. వైద్యం కోసం వచ్చే వారికి అక్కడి పరిస్థితులు చూస్తే రోగాలు తప్పవన్నట్లుంటాయి. ఈ మధ్య కాలంలో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి సైతం పారిశుద్యంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదంతా చూసిన సూపరింటిండెంట్ పారిశుద్య కార్మికులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా మార్పు రాలేదు. ఇక లాభం లేదు అనుకొని ఆయనే చీపురు చేత పట్టారు. బాత్రూంలు శుభ్రం చేశారు. తాపి చేత పట్టి మరమ్మత్తులు చేశారు. ఇంతకూ ఆయన ఎవరాంటారా... ఎవరో కాదు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటిండెంట్ కిరణ్..