శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం వేళ పువ్వులకు భారీ డిమాండ్.. కొండెక్కిన పువ్వుల ధరలు.. సామాన్యులు షాక్..

శ్రావణంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు శుభకార్యాలు కూడా విపరీతంగా ఉన్నాయి.. పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభోత్సవం.. ఇలా అనేక శుభకార్యాలు శ్రావణంలో లేదంటే కార్తీక మాసంలో జరుపుకోవడం ఆనవాయితీ. శ్రావణ శుక్రవారం పూట అమ్మవారిని నాలుగు పూలతో అలంకరించడం కూడా ఫుల్ కాస్లిగా మారింది..ఏ ఇంట్లో ఎక్కువ పూల పరిమళాలు వెదజల్లుతాయో వాళ్లు కాస్త రిచ్ అన్నట్లే.. ఎందుకంటే పూల ధరలు ఆ స్థాయిలో పెరిగిపోయాయి.