సంక్రాంతి సంబరాన్ని ఢిల్లీకి చేర్చిన కేంద్రమంత్రి

తెలుగుజాతి మొత్తాన్నీ ఏకంచేసే పండగ సంక్రాంతి. తెలుగు పల్లెలు, పట్టణాలకు పరిమితమైన సంక్రాంతి సంబరాన్ని రాజధాని ఢిల్లీకి చేర్చారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. సిసలైన సంక్రాంతికి అద్దం పట్టింది హస్తినలో కిషన్‌రెడ్డి ఇంట సంక్రాంతి సంబరం. ప్రధాని మోదీ రాకతో మరింత శోభాయమానంగా మారింది కిషన్‌రెడ్డి నివాసం.